రైల్వేశాఖ మంత్రికి ఎంపీ రేవంత్ లేఖ
హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను పరిష్కరించాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గతంలో హామీ ఇచ్చారని.. దాన్ని అమలు చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 21 అంశాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. మక్తల్-వికారాబాద్ వయా కొడంగల్ గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్.. అల్వాల్, మల్కాజ్గిరి, బొల్లారం రైల్వేస్టేషన్లలో అదనపు ఫ్లాట్ ఫాం నిర్మాణం చేపట్టాలని రేవంత్ కోరారు. మేడ్చల్ రైల్వేస్టేషన్లో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన కేంద్ర మంత్రి ద ష్టికి తీసుకెళ్లారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు మౌలాలి ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా కోరారు.