రాజస్థాన్లో రవాణా శాఖ అధికారుల నిర్వాకం
జైపూర్: రాజస్థాన్లోని ఝలావర్ జిల్లా రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఇది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడంటూ ఎనిమిదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నోటీసులు పంపారు. అంతేకాదు సదరు వ్యక్తి డ్రైవింగ్ లెసెన్సు రద్దు చేసినట్లు ఆయన ఇంటికి సమాచారం కూడా అందించారు. ఝాలావర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాజేంద్ర కసేరా 2011 సెప్టెంబరులో మతి చెందాడు. వంట సామగ్రి అమ్ముకోవడం కసేరా వ త్తి. అతడికి ద్విచక్రవాహనం తప్ప ఎలాంటి వాహనమూ లేదు. అలాంటిదీ ఈనెల 11న సీటు బెల్టు పెట్టుకోకుండా అతి వేగంతో కారునడుపుతున్నాడని అతడి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేశారు. ఈ విషయాన్ని కసేరా కుటుంబ సభ్యులకు తెలపగా కంగు తినడం వారి వంతైంది. ఎనిమిదేళ్ల క్రితం మతి చెందిన వ్యక్తి ఇటీవల కారెలా నడుపుతారంటూ విషయం తెలిసిన వారు ముక్కున వేలుసుకుంటున్నారు. ఈ విషయాన్నే రవాణా శాఖ అధికారులకు చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.