మాంద్యం తట్టుకునే సం’క్షేమ’ బడ్జెట్
- -రెవెన్యూ వ్యయం: రూ.1,11,055 కోట్లు
- – మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు
- – బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044. 08 కోట్లు
- – రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు
- – రైతుబీమాకు రూ.1,137 కోట్లు
- -విద్యుత్ రాయితీల కోసం రూ.8 వేల కోట్లు
- -ఆసరా పింఛన్లకు రూ.9,402 కోట్లు
- – రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు
- -రైతు రుణమాఫీకి రూ.6 వేల కోట్లు
- – గ్రామపంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు
‘దేశంలో స్థూల ఆర్థిక విధానాలు శాసించేది కేంద్రమే. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప మరో గత్యంతరం లేదు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ అలముకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై మేథోమథనం చేసి అనేక మంది ఆర్థిక గణాంకాల నిపుణులతో చర్చించి నిర్ధారణకు వచ్చాకే ఈ బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాం.” -కేసీఆర్
హైదరాబాద్:
తెెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్ చూపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతున్న నేపథ్యంలో 2019-20కు సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక చిట్టాపద్దును కేసీఆర్ సభ ముందు ఉంచారు. వాస్తవిక దక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రెకటించారు.
బడ్జెట్ ముఖ్యాంశాలివి
– రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ.20,950 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
-ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ.9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది.
-విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ.5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.
-అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లింపు, దీని కోసం బడ్జెట్లో తగిన కేటాయింపులు. బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం.
-పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధుల ఖర్చు. దీనిపై కార్యదర్శులు, ఆర్థికశాఖ నుంచి స్పష్టమైన సూచనలు
-గ్రామపంచాయతీలను 12,751కి పెంచాం. జిల్లా పరిషత్‌ల సంఖ్యను 32కి పెంచాం.
-కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నత స్థాయి సేవలు.
– గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ.
– పురపాలక సంఘాలను 142కి పెంచాం. కొత్తగా 7 మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటి సంఖ్య 13కి పెంచాం.
-పోలీసు కమిషనరేట్ల సంఖ్యను 9కి, పోలీస్సబ్డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం. పోలీసు సర్కిళ్ల సంఖ్యను 717కి, పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం.
– ఐదేళ్లలో కేంద్ర పథకాలద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.31,802 కోట్లు
లిఐదేళ్లలో రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2,72,926 కోట్లు
– గడిచిన ఏడాదిన్నరగా దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది
-2018-2019లో దేశంలో 8 నుంచి 5.8 శాతానికి జీడీపీ వద్ధి రేటు తగ్గింది
– 2018-2019 మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 8 శాతం నమోదు.
– 2018-19 రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 7 శాతం నమోదు
– 2018- 19 మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 6.6 శాతం నమోదు
– 2018-19 చివరి త్రైమాసికంలో దేశ జీడీపీ 5.5 శాతం నమోదు
– సియామ్ సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గగా.. అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి.
– గ్రామపంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు
– త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వద్ధాప్య పింఛన్లు
-పన్నేతర ఆదాయం రూ.15,875 కోట్లు
– కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ. 8,177.75 కోట్లు
-రుణాలు, అడ్వాన్సుల ఖర్చు రూ.8,896 కోట్లు
– కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.19,718.57 కోట్లు
– రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.69.328.57 కోట్లు
-అమ్మకపు పన్నుద్వారా వచ్చే ఆదాయం రూ.47,789 కోట్లు
-ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ.10,901 కోట్లు
-స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.6,146 కోట్లు
-వాహనాల పన్నుల ద్వారా ఆదాయం రూ.3,714 కోట్లు
మాంద్యం ప్రభావం పడింది
దేశంలో నెలకొన్న ఆర్థిక మాద్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా గణనీయంగా పడిందన్నారు. సోమవారం ఆయన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019-20 పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తాను ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నానన్నారు. ”జీఎస్టీ అమలు చేసిన తొలి ఏడాదిలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికీ కేంద్రం పరిహారం ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు జీఎస్టీ తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. అయితే, ఇటీవల ఏర్పడిన ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.175 కోట్లు, జూన్, జులై మాసాల్లో రూ.700 కోట్లు జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్న పరిహారం కన్నా, జూన్, జులైలో తీసుకున్న పరిహారం నాలుగింతలు పెరగడం దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం” అని తెలిపారు.
”దురదష్టవశాత్తు గడిచిన ఏడాదిన్నర కాలంగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తోంది. 2018-19 సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వ ద్ధి 8శాతంగా నమోదైంది. అప్పటినుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మరింత దిగజారి 5శాతం కనిష్ఠ వద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతం. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలే. ఆర్థిక మాద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం.”
అన్ని రంగాలపైనా మాంద్యం ప్రభావం!
”ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో సాగుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫేక్చరర్స్ (సియామ్) ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం మేర తగ్గిపోయింది. వాహనాల అమ్మకాలూ 10.65శాతం తగ్గాయి. ఇప్పటికే తయారైన వాహనాలను కొనేవారే లేక దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. దీనివల్ల అమ్మకం పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలూ పడిపోయాయి. వ్యాట్ తగ్గిపోయింది. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఆటోమొబైల్ రంగంలో ఇటీవల కాలంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ విషమ పరిస్థితికి అద్దం పడుతుంది.”
”చాలా పరిశ్రమలు మూత పడటంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వ ద్ధి శాతం 10.6శాతం నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా డాలర్‌తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ అత్యంత కనిష్ఠంగా 72.43 రూపాయలకు పడిపోయింది.”
ఆశించిన ఆదాయాభివద్ధి రాలేదు!
గతంలో ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర ఓటాన్ అకౌంట్లో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నాటికున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంది. కాగ్ అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69శాతం వ ద్ధి ఉంటుందని అంచనా వేస్తే.. 2019-20 త్రైమాసికంలో కేవలం 1.36 శాతమే వ ద్ధి సాధ్యమైంది. తెలంగాణలో కూడా 15 శాతం ఆదాయాభివ ద్ధి సాధ్యమని ఆశించినా.. కేవలం 5.46 ఆదాయ వ ద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో 13.6శాతం సగటు వార్షిక వ ద్ధిరేటు సాధిస్తే.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 6.61 శాతం మాత్రమే సాధించగలిగాం. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59శాతం వ ద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. మోటార్ వెహికల్ ట్యాక్స్‌లో వచ్చే ఆదాయం మరింత దారుణంగా పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో మోటారు వాహనాల పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 19శాతం సగటు వార్షిక వ ద్ధిరేటు సాధిస్తే.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది” అని కేసీఆర్ వివరించారు.
ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ ఈ పరిస్థితిలో తప్పకుండా మార్పు వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి.. ఆదాయం పెరిగితే అందుకు తగినట్టుగా అంచనాలను సవరించుకొనే వెసులుబాటు కూడా తమకు ఉందని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సగటు వద్ధిరేటు రెట్టింపైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 2019-20కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్ శాసన సభలో ప్రవేశపెట్టారు. ‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్డీపీ సగటు వ ద్ధి రేటు కేవలం 4.2 శాతం మాత్రమే ఉంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అది రెండు రెట్లకు పైగా పెరిగి 10.5 శాతంగా నమోదైంది. స్వరాష్ట్రంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత దఢంగా మారిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అని కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
గణనీయంగా పెరిగిన మూలధన వ్యయం
‘రాష్ట్రాభివద్ధి కోసం, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ.. నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. సమైక్య రాష్ట్రంలో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2 శాతం మాత్రమే. నిధుల వినియోగంలో ఎదురైన వివక్ష కారణంగా సమైక్య రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల మూల ధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది’ అని కేసీఆర్ వివరించారు.