ఎల్లంపల్లికి భారీగా వరదనీరు జలకళను సంతరించుకున్న సుందిళ్ల

కరీంనగర్‌,జూలై30: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 141.09 విూటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 విూట్లరు. ప్రస్తుతం నీటి నిలువ 6.1921 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30,028 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. మరోవైపు సుందిళ్ల బరాజ్‌ జలకళతో తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో బరాజ్‌లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్‌ లో 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్‌లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిళ్ల బరాజ్‌ బ్యాక్‌వాటర్‌ గోలివాడ పంప్‌హౌస్‌కు ఇప్పటికే చేరగా, తాజాగా మరోసారి ఫోర్‌బేలోకి వదిలారు. దీంతో గోలివాడ పంపుహౌస్‌లో 1వ నంబర్‌ మోటర్‌ ను పరీక్షి వెట్‌ ఏర్పాట్లుచేస్తున్నారు. కాళేశ్వరం అధికారులు అక్కడే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. సుందిళ్లలోకి అనుకున్నంత నీరు చేరుతుండడంతో అన్నారం పంప్‌హౌస్‌లోని రెండో నంబర్‌ మోటర్‌ను నిలిపివేశారు. పంపులను సిద్ధంచేసే క్రమంలో ఐదో మోటర్‌ వెట్న్‌క్రు ఏర్పాట్లుచేస్తున్నారు. /ూష్ట్రంలో పడుతున్న వర్షాలతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మేడిగడ్డ బరాజ్‌లో క్రమంగా నీటి నిల్వ పెరుగుతున్నది. ప్రాణహిత నుంచి ప్రవాహం పెరుగటంతో పంప్‌ హౌస్‌లోని 3, 4, 5, 6వ నంబర్‌ మోటర్ల ద్వారా ప్రాణహిత జలాలను గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బరాజ్‌కు తరలించారు. ప్రాణహిత ప్రవాహం పెరిగితే మరిన్ని మోటర్లను ఆన్‌ చేయనున్నారు. గోదావరి బేసిన్‌లో ఈసారి ప్రాణహిత నుంచి వరద స్థిరంగా కొనసాగుతున్నది. కన్నెపల్లి వద్ద సుమారు 10-12 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. రెండురోజులుగా కడెం నుంచి వరద భారీగా వస్తున్నది. ఇన్‌ఎ/-లో 13వేల క్యూసెక్కులకు పైగా నమోదవుతున్నది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు-7.603టీఎంసీలు). ప్రస్తుతం 686.200 అడుగులు 4.524 టీఎంసీల వద్ద ఉన్నది.
కడెం నుంచి ఇవాళ సాయంత్రం తర్వాత దిగువకు నీటిని వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి జలాశయానికి 3,222 క్యూసెక్కుల ఇన్‌ఎ/-లో నమోదైంది. ఇన్‌ ఫ్లో పెరుగుతుండటంతో కాళేశ్వరం రెండో లింకునకు నీటి లభ్యత మరింత మెరుగువుతుంది. ఇంద్రావతి నుంచి వరద బాగా పెరుగటంతో పేరూరు వద్ద ప్రవాహం 69వేల క్యూసెక్కులకు పెరిగింది. దిగువన ధవళేశ్వరం వద్ద అదే సమయానికి ఇన్‌ఎ/-లో 37వేల క్యూసెక్కులకు పైగానే ఉంది. అంటే ఇంద్రావతిలో ప్రవాహం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నది.